సంస్థల సందర్శన

తెలంగాణ శాసనమండలి, పాఠశాలలు, కళాశాలలు, విద్యార్థుల సంవత్సర కాలమంతయు శాసనమండలిని సందర్శించుటకు ఒక కార్యక్రమమును ప్రవేశపెట్టింది. ఇది ప్రత్యేకంగా విద్యాసంస్థలకు సంబంధించినది. ఈ సందర్శనల ద్వారా వివిధ పాఠశాలలు మరియు కళాశాలల నుండి వచ్చిన విద్యార్థులు రాష్ట్ర శాసన మండలి పని తీరుకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని తెలుసుకుంటారు. అది వారికి పార్లమెంటరీ వ్యవస్థను అవగాహన చేసుకోవడానికి తోడ్పడుతుంది. ఈ సందర్శనలో తెలంగాణ శాసన మండలి యొక్క పర్యటన, తెలంగాణ శాసన సభ, శాసన పరిషత్తు మరియు గ్రంథాలయము కలిగి ఉన్నాయి.

సందర్శనను అభ్యర్థించుటకు, సంస్థ యొక్క అధిపతి సంస్థ తరుపున కింది చిరునామాలతో విద్యార్థుల మరియు ఆ బృందంతో కూడి ఉన్న ఉపాధ్యాయుల వివరాలు మరియు సందర్శనకు ఎంచుకున్న తేదీలను అభ్యర్థనగా పంపవలెను.

శాసన సభ సచివాలయ అధికారులు తమ ఏర్పాట్లు నిర్ధారించుకున్న మీదట, సంస్థ సందర్శనానికి ప్రణాళిక సిద్ధం చేసుకోవలెను.

సందర్శన అభ్యర్థనకు, దయచేసి వీరికి వ్రాయండి.......


డా.ఎస్. రాజ సదారామ్, కార్యదర్శి,

తెలంగాణ శాసనసభ సచివాలయం,
పబ్లిక్ గార్డెన్సు,
హైదరాబాదు - 500004,
తెలంగాణ రాష్ట్రం, భారతదేశం.

Tel: +91 40 23232072
Fax: +91 40 23210408
eMail:secy_legis@telangana.gov.in

 

సందర్శకుల గ్యాలరీలోనికి ప్రవేశం

శాసన పరిషత్తు, శాసన సభ సమావేశాలను వీక్షించాలనుకున్న సాధారణ ప్రజలు తమ వినతి పత్రమును నిర్దేశించిన రూపమున సభలు సమావేశంలో ఉన్నప్పుడు శాసనమండలి సచివాలయాన్ని సంప్రదించగలరు.
 

Request form

Particulars of Students visited to watch Proceedings of the Legislative Assembly during Sixth Session (16.12.2016 to 18.01.2017).

Quick Links