శాసన సభ్యులకు జీతాలు, భత్యాలు

        ప్రతి సభ్యునికి నెలకు రూ.20,000 ల జీతాన్ని, రూ.2,30,000 ల నియోజకవర్గం భత్యాన్ని చెల్లించడమవుతుంది. సభ్యుడు, శాసనసభ్యుల హాస్టలులో వసతిని వినియోగించుకోకపోయినట్లయితే, ఆయనకు నెలకు రూ.25,000 ల వసతి భత్యాన్ని పొందడానికి కూడా అర్హుడవుతాడు. సభ్యులు హాజరైన సమావేశాల రోజుల కోసం రూ.1000 ల దినసరి భత్యం చెల్లించడమవుతుంది.